NRI-NRT

NRI-BRS ప్రతినిధులతో కవిత భేటీ

NRI-BRS ప్రతినిధులతో కవిత భేటీ

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆర్ఎస్ ఎన్నారైల బృందం పేర్కొంది. మహేష్ బిగాలా ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం వివిధ దేశాల ఎన్నారైలు మహేష్ తన్నీరు, చందు తల్లా, హరీష్ రెడ్డి, సురేష్ క‌లిసి ఎమ్మెల్సీ కవితను అభినందించారు. అలాగే వివిధ అంశాలపై వారు చర్చించారు.

ఎన్నారైలు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయ‌న్నారు.

రాబోయే ఎన్నికల్లో అమెరికాలోని ఎన్నారైలందరు వివిధ ప్రసార‌ మాధ్యమాల ద్వారా బీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజలలోకి తీసుకెళ్తామని, అలాగే ఎన్నారైల తరపున ఎన్నికల ప్రచార ప్రణాళికను సిద్ధం చేశారని అన్నారు. వివిధ దేశాల ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారములో పాల్గొంటారని అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్‌ అండ్ టెలీఫోనిక్ కాంపెయిన్ లతో ప్రజల్లోకి బీఆర్ఎస్ పథకాలను తీసుకెళ్తామని తెలిపారు.