భారత్‌లో అమెరికా ఎంబసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత సంవత్సరంలో అన్ని రకాల కలిపి మిలియన్ వీసాలను జారీ చేయాలన్న తమ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య 10లక్షలు దాటింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘‘Missionto1M పూర్తయ్యింది..! భారత్‌లో ఈ ఏడాది వీసాల (Visa) ప్రక్రియలో మేం పెట్టుకున్న ‘మిలియన్ వీసాల జారీ’ లక్ష్యాన్ని దాటేశాం. అయితే, ఇక్కడితో మేం ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తాం’’ అని అమెరికా ఎంబసీ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి ఓ వీడియో కూడా జత చేసింది.
భారతీయులకు…ఈ ఏడాది 10లక్షల వీసాలు అందించిన అమెరికా
Related tags :