ScienceAndTech

TCS ఉద్యోగులు ఆఫీసుకు రావల్సిందే!

TCS ఉద్యోగులు ఆఫీసుకు రావల్సిందే!

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులంతా కార్యాలయాలకు రావాలని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం ఇచ్చిందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొంది. వచ్చే నెల నుంచి వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలూ టీసీఎస్‌ను అనుసరించే అవకాశం ఉంది. కరోనా సమయంలో మొదలైన పూర్తి వర్క్‌ఫ్రమ్‌ అనంతరం.. ఈ హైబ్రిడ్‌ వర్క్‌ సంస్కృతి మొదలైంది. దీంతో చాలా మంది ఉద్యోగులు వారంలో మూడు రోజులు మాత్రమే కార్యాలయాలకు వెళ్లి మిగిలిన రెండ్రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ, చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పేరిట ఉద్యోగులు ఐదు రోజులూ కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఇ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్‌ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.