అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ సంచలనాన్ని క్రియేట్ చేసిన బీఆర్‌ఎస్.. కాంగ్రెస్, బీజేపీ దిమ్మ తిరిగేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సొమ్ము తదితర అనేక పథకాలను రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. ఈసారి రైతులతో పాటు యువత, మహిళలపై దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణా కాంగ్రెస్ ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ఆరు హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నించగా.. BRS తన ఎన్నికల మేనిఫెస్టోను మరింత ఆకర్శనీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తును చేస్తోంది. విజయదశమి రోజున బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించనున్నారు.
దసరాకు భారాస మేనిఫెస్టో సిద్ధం
Related tags :