అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫెడరల్ ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో అక్టోబరు 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నట్లుగా సరిహద్దు భద్రత సహా పలు ఏజెన్సీల చెల్లింపుల కోసం ప్రతిపాదించిన మొత్తాల్లో 30 శాతం మేర నిధుల కోత విధించినప్పటికీ మద్దతిచ్చేందుకు వారు మొండికేస్తున్నారు. ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును వీటో చేయదలిచారు. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లోని దిగువ సభ(ప్రజాప్రతినిధుల)లో రిపబ్లికన్లకే కాస్త మెజారిటీ ఉంది. ఈ సభ స్పీకర్ కెవిన్ మెకార్థీ ఆ పార్టీకి చెందినవారే. అయినప్పటికీ ప్రతిష్టంభనను నివారించేందుకు ఆయన చేసిన చిట్టచివరి ప్రయత్నాలూ ఫలించలేదు. ఎన్నికల సంవత్సరంలో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న ట్రంప్ మద్దతుదారులైన రిపబ్లికన్ పార్టీ సభ్యుల వైఖరిని అధికారపక్షమైన డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. శనివారంలోగా ప్రభుత్వ బిల్లుకు ఆమోదం లభించకపోతే ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులన్నీ నిలిచిపోతాయి. సైనికులకు వేతనాలు, వివిధ పథకాలకు నిధులు అందజేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
అమెరికా “షట్‌డౌన్”
Related tags :