అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో 37 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
అత్యంత సులువైన ‘డ్రా’ పొందిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో నేపాల్ జట్టుపై 3–0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–5, 21–8తో ప్రిన్స్ దహాల్‌పై.. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–4, 21–3తో సునీల్ జోషిపై.. మూడో సింగిల్స్‌లో మిథున్ మంజునాథ్ 21–2, 21–17తో బిష్ణు కతువాల్పై నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది.
భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మూడుసార్లు సెమీఫైనల్లో ఓడిపోయి (టెహ్రాన్; 1974లో, న్యూఢిల్లీ; 1982లో, సియోల్; 1986లో) కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు భారత మహిళల జట్టు కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 0–3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–14, 15–21, 14–21తో చోచువోంగ్ చేతిలో… రెండో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 19–21, 5–21తో జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోంగ్జయ్ చేతిలో… మూడో మ్యాచ్‌లో అషి్మత చాలిహా 9–21, 16–21తో బుసానన్ చేతిలో పరాజయం పాలయ్యారు.