Devotional

తిరుమల ఘాట్‌రోడ్డు ప్రయాణీకులకు సూచన-తాజావార్తలు

తిరుమల ఘాట్‌రోడ్డు ప్రయాణీకులకు సూచన-తాజావార్తలు

* తెలంగాణ ప్రజలకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ మరిన్ని శుభవార్తలు చెబుతారని మంత్రి హరీశ్‌రావు (Harish Rao) వెల్లడించారు. ప్రజల కోసం మరిన్ని కొత్త పథకాలను తీసుకురాబోతున్నామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం ఆయన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ (బుధవారం) వరకు వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేశ్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

* సీఎం జగన్ వాహన మిత్ర ద్వారా రూ.10 వేలు ఇస్తూ.. రూ.లక్ష కొట్టేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సంక్షేమానికి ఏటా బడ్జెట్‌లో తెదేపా అధినేత చంద్రబాబు 18.21 శాతం నిధులు ఖర్చు పెడితే.. జగన్ 16.20 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టేలా చంద్రబాబు సంక్షేమం అమలు చేశారని, డ్రైవర్లకు ఇన్నోవా కారు ఇచ్చి యజమానిని చేశారని గుర్తుచేశారు.

* తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెదేపా(TDP) సెప్టెంబర్‌ 30న వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

* తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) త్వరగా విడుదలవ్వాలని భద్రాద్రి రామయ్య సన్నిధిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు కాలినడకన భద్రాచలం చేరుకుని స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అని నినాదాలు చేశారు.

* కెనడా-భారత్‌ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) వరుస హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో భారత్‌ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌పైనా (ICC World Cup 2023).. ఈ ఉగ్రవాది కన్ను పడినట్లు తెలుస్తోంది. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను ‘వరల్డ్‌ టెర్రర్‌ కప్‌’గా మారుస్తానంటూ చేసిన హెచ్చరికలు సంచలనం రేపుతున్నాయి.

* నా సొంత భూమి కూడా ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో పోయింది. 2001లో ఈడుపుగల్లులో కొన్న 40 సెంట్ల సొంత స్థలం అది. దాని విలువ రూ.7 కోట్లు. సొంత భూమినే పొగొట్టుకున్న నేను.. అవినీతి చేస్తానా?కావాలనే బురద చల్లుతున్నారు. మాపై చేసే ఆరోపణల్లో నిజమేంటో కోర్టుల్లో తేలుతుంది. తెదేపా, జనసేన పార్టీ కమిటీలు ఇచ్చే నివేదిక ప్రకారం ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతాం’’ అని నారాయణ చెప్పారు.

* గోశాలలోని గోవులను (cows) ఇస్కాన్‌ కబేళాలకు విక్రయిస్తోందని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ (Maneka Gandhi) చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఆరోపణలను ఇస్కాన్‌ ఇదివరకే ఖండించింది. ఆమె వ్యాఖ్యలపై తాజాగా ఆ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించింది.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ నాలుగోదశ వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈమేరకు జనసేన పార్టీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారాహి వాహనంపై నుంచి పవన్‌ ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ కల్యాణ్ పర్యటిస్తారు’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

* తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు(TMB) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్‌ క్రిష్ణన్‌ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాన్ని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఒక కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.9 వేల కోట్లు జమ అయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ‘ఇంకా నా పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌, సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నాను’ అని క్రిష్ణన్ వెల్లడించారు. బ్యాంకు బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్స్‌ ఈ రాజీనామాపై సమావేశం నిర్వహించి.. ఆమోదం తెలిపారు. అలాగే దీనిపై ఆర్‌బీఐకి సమాచారం ఇచ్చారు. 2022లో క్రిష్ణన్‌ తన బాధ్యతల్లోకి వచ్చారు.

* ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి నిలదీశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. సులభతర వాణిజ్యం, నైపుణ్యాభివృధ్ధి రంగాల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారన్నారు. ఇప్పుడు అమరరాజా నుంచి లులు వరకూ ఎన్నో పరిశ్రమలు ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోయాయన్నారు. ప్రస్తుతం చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్తున్నాయని బ్రాహ్మణి ఆరోపించారు.

* వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) కోసం పది జట్లు భారత్‌కు చేరుకున్నాయి. నేటి నుంచి వార్మప్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు వచ్చింది. పాక్‌ ఆటగాళ్లకు క్రికెట్ అభిమానులు అద్భుతంగా స్వాగతం పలికారు. దాంతో పాక్‌ క్రికెటర్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ వేదికగానే న్యూజిలాండ్‌తో పాక్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు చీఫ్‌ జకా అష్రాఫ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పాక్‌ ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లకు సంబంధించిన కార్యక్రమంలో జకా అష్రాఫ్‌ మాట్లాడుతూ.. ‘‘మా ఆటగాళ్లకు మంచి కాంట్రాక్ట్‌లను అందించడం ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ పాక్‌ క్రికెట్ చరిత్రలో ఇలా ఎవరూ చేయలేదు. భారీ మొత్తం ఆటగాళ్లకు కేటాయించాం. మన ప్లేయర్లు ఎప్పుడైనా సరే ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. అందులో మన శత్రు దేశం ఉన్నా సరే పాక్‌ ఆటగాళ్లు నీతికి కట్టుబడి ఉంటారు’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో జకాపై విమర్శలు వచ్చాయి. పాక్‌కు భారత్‌లో అపూర్వ స్వాగతం లభించినా.. ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని ఇరు దేశాల క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోశారు.

* సినిమా చిత్రీకరణలో ప్రమాదానికి గురైన దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ‘విలాయత్‌ బుద్ధ’ (Vilayath Buddha) సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తూ బస్సు నుంచి జారి పడడంతో పృథ్వీరాజ్‌కు గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన మోకాలుకు శస్త్రచికిత్స చేశారు. తాను కోలుకున్నట్లు తాజాగా తెలిపిన పృథ్వీరాజ్‌ తనకు చికిత్స చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పారు.

* మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై (Simultaneous polls) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్‌ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను (One nation One election) నిర్వహించేలా లా కమిషన్‌ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

* కెనడా-భారత్‌ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) వరుస హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో భారత్‌ వేదికగా ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌పైనా (ICC World Cup 2023).. ఈ ఉగ్రవాది కన్ను పడినట్లు తెలుస్తోంది. క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ను ‘వరల్డ్‌ టెర్రర్‌ కప్‌’గా మారుస్తానంటూ చేసిన హెచ్చరికలు సంచలనం రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గుజరాత్‌ పోలీసులు.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అక్టోబర్‌ 5న గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్‌ కప్‌ 2023 (Cricket World Cup) తొలి మ్యాచ్‌ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌తో పాటు ఇక్కడ పలు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) సంస్థ చీఫ్‌, ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల హత్యకు గురైన నిజ్జర్‌కు ప్రతీకారంగా కెనడా నుంచి కొందరు ఖలీస్థాన్‌ మద్దతుదారులు భారత్‌కు చేరుకున్నారంటూ చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించి గురుపత్వంత్‌ సింగ్‌ మాట్లాడినట్లు ఉన్న ప్రీ-రికార్డింగ్‌ ఆడియో కాల్‌ దేశవ్యాప్తంగా ఎంతో మందికి వచ్చింది. ఈ విషయాన్ని పలువురు గుజరాత్‌ వ్యక్తులు స్థానిక పోలీసులకు తెలియజేశారు.

* వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూముల విక్రయానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రక్రియ ప్రారంభించింది. స్టీల్‌ ప్లాంట్‌లోని నాన్‌ కోర్‌ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఓ త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్‌ ల్యాండ్‌ మోనటైజేషన్‌ కార్పొరేషన్, నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లు ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ల్యాండ్‌ మోనటైజేషన్‌ కార్పొరేషన్‌ తొలి దశలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 1400 ఎకరాల భూములను విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ భూముల విక్రయానికి సంబంధించి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ సాంకేతిక, భూముల బదలాయింపు సలహాదారుగా వ్యవహరించనుంది.

* తిరుమల ఘాట్‌ రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆంక్షలు సడలించింది. శుక్రవారం నుంచి ఘాట్‌ రోడ్డులో రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఘాట్‌రోడ్డులో వన్యమృగాల కదలికలు తగ్గడంతో ఆంక్షలు సడలించినట్లు తితిదే పేర్కొంది. చిరుతల సంచారం నేపథ్యంలో ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించారు. తాజాగా ఆంక్షలు సడలించడంతో రాత్రి 10 గంటల వరకు బైక్‌లను అనుమతించనున్నారు. ఘాట్‌రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తితిదే సూచించింది.