భారత్‌లో నేటి (అక్టోబర్ 1) నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఆఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. తమ దేశం పట్ల భారత్ ఆసక్తి చూపకపోవడం, దౌత్యపరంగా తగిన మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘భారత్, ఆఫ్గానిస్థాన్ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అన్ని విధాలుగా ఆలోచించే భారత్‌లో మా దౌత్యపరమైన కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించాం. ఇందుకు మేమెంతో చింతిస్తున్నాం’’అని ప్రకటనలో పేర్కొంది.
భారత్‌కు ఆఫ్ఘానిస్థాన్ గుడ్‌బై
Related tags :