హాంకాంగ్ లో నివసిస్తున్న తెలుగు ప్రవాస భారతీయులు నేడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ ప్రదర్శన జరిపారు. తెలుగు రాష్టాల అభివృద్ధికి పాటు పడిన ఒక మహానేత పట్ల నేడు ఆంధ్ర రాష్ట్రంలో కక్షా రాజకీయాలు జరపటం బాధాకరంగా ఉందని వాపోయారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి వల్లనే మధ్య తరగతి యువత నేడు దేశవిదేశాలకేగి ఉన్నత స్థాయికి చేరుకోగలిగారని వివరించారు.
నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడగా, నేటి ఆంధ్ర రాష్ట్రం కక్షా రాజకీయాలకు ప్రతీకగా నిలవడం బాధాకరంగా ఉందని చెపుతూ, #WestandwithCBN అనే నినాదం పలికారు. ఆయన తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో, అప్పటి సమైఖ్యాంద్రకు టెక్నాలజీ పరిశ్రమలు వచ్చేలా చేసి, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు వచ్చేలా చేసారని గుర్తు చేసుకున్నారు. నేడు ఐటీ రంగంలో హైదరాబాద్ పొరుగు రాష్ట్రాలకు పోటీ ఇవ్వడం నాటి చంద్రబాబు విజన్ మరియు కష్టానికి నిదర్శనమని, అదే తీరులో నవ్యాంధ్ర ప్రదేశ్‌ని ప్రపంచపటంలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. హుద్ హుద్ లాంటి మహా ప్రళయం విశాఖ నగరాన్ని నేలమట్టం చేస్తే, చంద్రబాబు నాయుడు ఇతర ముఖ్యమంత్రుల లాగా హెలీకాప్టర్ లో సర్వేలు చేసి తన సుఖాన్ని చూసుకోకుండా, ‘నేను సైతం’ అంటూ చంద్రబాబు ప్రజల కష్టాల్ని తీర్చటానికి ప్రజల మధ్యనే ఉండటం మర్చిపోలేమన్నారు. సోషల్ మీడీయా ద్వారా ప్రవాశాంధ్రులకు తమ సొంత వారి యోగక్షేమాలు తెలుపుతూ యుధ్ధ ప్రాతిపధికతో విశాఖ నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడాన్ని సీఐఐ సమిట్ మరియు అప్పటి కేంద్ర ప్రభుత్వం కొనియాడిందని గుర్తు చేసుకున్నారు. నేటి కేంద్ర అమలుచేస్తున్న స్వచ్ఛ భారత్ వంటి పథకాలు చంద్రబాబు ఏనాడో జన్మభూమి, రైతుబజార్ పథకాల పేరుతో అమలు చేయటం ఆయన ముందుచూపుకు నిదర్శనమన్నారు.
నవ్యాంధ్ర భవిష్యత్ కోసం అవకాశాలు వెతుక్కుంటూ దేశంలోనే కాకుండా డావోస్ WEFకు సహితం వెళ్ళి అగ్రవ్యాపారాల నేతలను మెప్పించి మన రాష్ట్రానికి కొత్త వ్యాపార సంస్థలు వచ్చేలా చేసారని చెప్పారు. ఒక కొత్త రాష్టృానికి మొదటి ముఖ్యమంత్రిగా, ఆయన ఎన్నో కష్టాల్ని ఎదురుకున్నారని, లోటు బడ్జెట్ రాష్టాృన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయన శత్రువులతో, మిత్రపక్షాలతో, సమయంతో మరియు ప్రకృతి వైపరీత్యాలతో పోరాడారని చెప్పుకొచ్చారు. కియ వంటి పెద్ద సంస్థలు తీసుకురావటమే కాకుండా, నవ్యాంధ్ర ఇన్నొవేషన్ వాలీగా మారాలని స్టార్టప్సకు ఆర్థిక చేయూతని ఇచ్చి స్థిరమైన అభివృద్ధికి, మార్గాన్ని చూపించారన్నారు. ఆంధ్రుల బంగారు కలగా మిగిలిపోయిన పోలవరం ప్రాజక్టు పూర్తి చేయాలని చంద్రబాబు యంత్రాంగం అహర్నిశలూ శ్రమించినా మన దురదృష్టం వల్ల పూర్తికాలేదన్నారు.
మన బంగారు భవిష్యత్ కోసం మరియు మన భావి తరాల అభివృద్ధి కోసం పాటు పడే మహానాయకుడికి మద్దత్తునివ్వాలని, సంఘీభావం ప్రకటిస్తూ, ఇది మన తెలుగు వారి బాధ్యత అని గుర్తుచేసారు.