* కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పైకి ఎదగాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్ అన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు.
* ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds)ను జారీ చేయడం చట్టపరమైన లంచం అని కాంగ్రెస్ నేత చిదరంబరం ఆరోపించారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి పది రోజుల పాటు ఎలక్టోరల్ బాండ్లను ఓపెన్ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత చిదంబరం ఆ ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్‌కు ఇది బంగారు పంటగా మారుతుందని ఆయన విమర్శించారు. 28వ సారి ఎలక్టోరల్ బాండ్లను అనుమతి ఇస్తూ కేంద్ర సర్కారు శుక్రవారం ప్రకటన జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అన్ని బ్రాంచిలలో అక్టోబర్ 4 నుంచి 13న వరకు 28వ విడత ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
* హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెసాంట్ నగర్ విద్యుత్ శ్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.
* ప్రకాశంజిల్లా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న బాలినేనికి ఈమధ్యే పార్టీ నాయకత్వం పెత్తనంమీదేనని భరోసా ఇచ్చింది. తనపై బాధ్యతలు పెడుతూ సమీక్షా సమావేశాల్లో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకటన చేసి నెల తిరక్కుండానే తన అనుచరులని సస్పెండ్ చేయడాన్ని అవమానంగా భావిస్తున్నారట బాలినేని. పర్చూరులో భవనం శ్రీనివాసులురెడ్డి.. బాలినేనికి ప్రధాన అనుచరుడు. భవనం సతీమణి ప్రస్తుతం జడ్పీటీసీ. పర్చూరులో పార్టీ ఇంచార్జిగా ఎవరున్నా భవనం శ్రీనివాసులురెడ్డిని కాదని వెళ్లలేరన్న ప్రచారం ఉంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇంచార్జిగా వచ్చాక పార్టీలో భవనం ప్రాధాన్యం తగ్గిందట. ఆమంచి, బాలినేనికి మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణమంటున్నారు.
* ప్రధాని నరేంద్రమోదీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంశల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల కాల వ్యవధిలోనే పార్లమెంట్ నూతన భవనం, చంద్రయాన్-3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా ఏకంగా నాలుగు విజయాలు నమోదు చేశారని కొనియాడారు. వీటిని సాధించాలంటే వేరేవాళ్లకి ఇంకో 50 సంవత్సరాలు పట్టేదని వ్యాఖ్యానించారు. శనివారం అహ్మదాబాద్‌లో నిర్వహించినటువంటి ఓ సభలో అమిత్ షా మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ‘ఇస్రో’కు ప్రధాని మోదీ పునరుజ్జీవం పోశారని పేర్కొన్నారు. అలాగే శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. అలాగే భారత్ జీ20 సదస్సుకు సారథ్యం వహించి.. ఈ సదస్సు ద్వారా అభివృద్ధి చెందిన, అభివద్ధి చెందుతున్న దేశాల వైపు భారత్ ఉంటుందన్న సందేశాన్ని ప్రధాని మోదీ పంపారని అన్నారు.
* ఢిల్లీలో నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. అక్కడికి వెళ్లి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు.. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా లోకేష్‌ను ఇటీవల సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా 41A కింద విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది.
* తెదేపా అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని తెలిసి చాలా మంది బాధపడ్డారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక దాదాపు 97 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. నంద్యాలలో ఇవాళ తెదేపా పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. చనిపోయిన 97 మంది పట్ల ఈ సమావేశం సంతాపం వ్యక్తం చేసింది.
* తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. శనివారం సిద్దిసేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దుదృష్టకరమన్నారు. ఆయన్ను అరెస్టు చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుపై పార్టీలకతీతంగా నేతలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
* నల్గొండ జిల్లా మర్రిగూడ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహిస్తోన్న మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు, బంగారాన్ని గుర్తించారు. ఆయన ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు రూ.2 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
* మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్ కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తమకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
* జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో.. ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.
* కాంగ్రెస్ (Congress) హయాంలో తీసుకొచ్చిన ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) దుయ్యబట్టారు. రేషన్, మద్యం దగ్గర్నుంచి చివరకు ఆవు పేడనూ వారు వదల్లేదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బిలాస్‌పుర్‌లో శనివారం జరిగిన ‘పరివర్తన్ మహా సంకల్ప్ ర్యాలీ’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
* ప్రధాని నరేంద్రమోదీపై (PM modi) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల వ్యవధిలో పార్లమెంట్ నూతన భవనం, చంద్రయాన్-3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్ బిల్లు నాలుగు విజయాలు నమోదు చేశారని కొనియాడారు. ఇంకెవరికైనా అయితే 50 ఏళ్లు పట్టేదని అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన సభలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
* రపంచంలోని ప్రముఖ పర్యాటక దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్.. నల్లుల (Bed Bugs) బెడదతో సతమతమవుతోంది. ముఖ్యంగా రాజధాని పారిస్ (Paris)లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రజారవాణా సాధనాలు, సినిమా హాళ్లు ఇలా నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవి విస్తృతంగా వ్యాప్తి చెందాయి. నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ ఉపమేయర్ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడల (Paris Olympics) నిర్వహణకు పారిస్ సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చింది. పారిస్‌లో ఇటీవలి కాలంలో నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మెట్రోలు, బస్సులు, రైళ్లు, సినిమా థియేటర్లు ఇలా అనేక చోట్ల ఇవి ప్రజలకు నరకం చూపుతున్నాయి. దీనికి సంబంధించిన అనేక పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నల్లి పురుగుల కట్టడికిగానూ వచ్చే వారం ప్రజారవాణా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఫ్రాన్స్ రవాణాశాఖ మంత్రి క్లెమెంట్ బ్యూన్ తెలిపారు. మరోవైపు.. నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్ ఉప మేయర్ ఇమాన్యుయేల్ గ్రెగోయిర్ చెప్పారు. రోజూ 36 లక్షల మంది ప్రజలు పారిస్‌కు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ క్రమంలోనే నల్లుల ఉద్ధృతి పెరుగుతోందన్నారు.
* వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక సూచన చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. దీనికోసం ఔత్సాహికులైన అధికారులను గుర్తించాలని ఉన్నతాధికారులకు ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చి ‘ ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమం అమలుపై ‘ సంకల్ప్ సప్తాహ్’ పేరిట దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. శనివారం నుంచి ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
* భారత హైకమిషనర్(Indian High Commissioner)ని స్థానికంగా ఓ గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఘటనను బ్రిటన్ ప్రభుత్వం(UK government) సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భారత్‌కు యూకే హామీ ఇచ్చింది. యూకేలోని గురుద్వారాలకు భారతీయులు, భారతీయ సమాజానికి ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం పొందడానికి కొందరు అతివాదభావజాలం కలిగిన వ్యక్తులు ఈ తరహా చర్యలకు పాల్పడుతుంటారు’ అని యూకే ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది.