Politics

కంచాలు ఈడీ కార్యాలయం ఎదుట మోగించండి

కంచాలు ఈడీ కార్యాలయం ఎదుట మోగించండి

చట్టమంటే టీడీపీ నాయకులకు గౌరవం ఉందా?.. అవినీతికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్‌ చేస్తే న్యాయస్థానాలను అపహాస్యం చేస్తారా అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నాయకులు చట్ట వ్యతిరేక వ్యక్తులుగా మారారని ధ్వజమెత్తారు. ‘‘ఢిల్లీలో ఉన్న లోకేష్‌ అక్కడే ఈడీ కార్యాలయం ముందు కంచాలు, విజిల్స్‌ కొట్టాల్సింది. తప్పు చేశారు కాబట్టే క్వాష్‌ పిటిషన్‌ వేసినా ఏ కోర్టులోనూ బాబుకు బెయిల్‌ లభించలేదు. లంచాలు తినేసి కంచాలు మోగించడం టీడీపీకే చెల్లింది. అవినీతి చేసిన వారిపై ఆధారాలు దొరికినప్పుడు కేసులు పెట్టడం చట్టబద్ధమైన చర్య’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.