Devotional

తిరుమలలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు‌‌‌. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. క్యూలెన్లలో ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది అన్న ప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు.