Food

ప్రకాశం జిల్లా స్పెషల్…జెర్రి బిర్యానీ

ప్రకాశం జిల్లా స్పెషల్…జెర్రి బిర్యానీ

ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలోని సత్య మ్యాక్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో బిర్యానీ తినేందుకు వెళ్లిన ఓ కస్టమర్‌కు ఇదే తరహా అనుభవం ఎదురైంది. రెస్టారెంట్‌కు వెళ్ళిన కస్టమర్ బిర్యానీ అర్దరిచ్చాడు. మధ్యాహ్నం సమయంలో లేటుగా వెళ్ళాడేమో.. ఆకలితో ఉన్న ఆ కస్టమర్‌కు బిర్యానీ సర్వ్‌ చేయగానే ఆబగా లాగించేస్తున్నాడు. మధ్యలో చికెన్‌ ముక్కకు బదులు ఏదో పాకుడు జీవి కనిపించింది. దీంతో అవాక్కయిన కస్టమర్‌ దాన్ని తేరిపారా చూశాడు.. అంతే అతని గుండె ఝల్లుమంది. అది చికెన్ ముక్క కాదు. ఒళ్ళంతా కాళ్ళతో పాకులాడే జెర్రిగా గుర్తించాడు. వెంటనే వాంతి వచ్చినంత పనైంది..! కొద్దిసేపు కంగారుపడ్డ ఆ కస్టమర్‌ తేరుకుని హోటల్‌ సిబ్బందికి బిర్యానీలో వచ్చిన జెర్రిని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిర్యానీలో వచ్చిన జెర్రి ఫోటోలు తీసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదుకు సిద్ధమయ్యాడు. సదరు హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కస్టమర్లు.