Politics

మోత మోగించిన తెదేపా కార్యకర్తలపై కేసులు

మోత మోగించిన తెదేపా కార్యకర్తలపై కేసులు

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మోత మోగిద్దాం’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసు నమోదైంది. గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు నమోదు చేశారు. శనివారం రాత్రి బృందావన్‌ గార్డెన్స్‌ రహదారిపై ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసు పెట్టారు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలకు ఆటంకం కలిగించేలా నిరసన తెలిపారని.. గుంపులుగా చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.