కేరళలో స్టేషన్, జాగిలాలు, జీపు తదితరాలను అద్దెకిచ్చేందుకు అనుమతి ఉంది. అందుకు నామమాత్రంగానే ఫీజు వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు ధరల్ని పెంచిన పోలీస్ శాఖ అందుకు సంబంధించి ఉత్తర్వులూ, కొన్ని నిబంధనలూ జారీ చేసింది. పోలీస్ స్టేషన్‌నీ, ఎక్విప్‌మెంట్‌నీ, జీపునీ, ఇన్‌స్పెక్టర్ సేవల్నీ వాడుకుంటే రూ.34 వేలు చెల్లించాలి. కేవలం సీఐ ర్యాంకు అధికారి సేవలకు దాదాపు రూ.3500, పోలీస్ జాగిలానికి సుమారు రూ.7500, వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్ లేదా పోలీస్ స్టేషన్ కావాలంటే రూ.12000కిపైనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవల్ని కేవలం ప్రయివేటు పార్టీలు, వినోదం, సినిమా లేదా డాక్యుమెంటరీ షూటింగులకోసమే ఉపయోగించాల్సి ఉంటుంది.
అధికారులతో పాటు అద్దెకు పోలీస్ స్టేషన్
Related tags :