పోట్రు అనంతరామయ్య 1947 జనవరి 1న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కొండ్రుగట్ల మల్లెలలో(కేజీ.మల్లెల) వరదయ్య, తిరుపతమ్మ దంపతులకు జన్మించారు. 1974 నుండి 1980 వరకు కేజీ.మల్లెల సోసైటీ అధ్యక్షులుగా 1988 మార్చ్ 10 నుండి 1995 జూన్ వరకు కేజీ మల్లెల సర్పంచ్ గా పనిచేశారు. అనంతరం కేజీ.మల్లెల పంచాయితీ మహిళలకు కేటాయించడంతో భార్య పోట్రు నాగేశ్వరమ్మను పోటీకి నిలిపి గెలిపించారు. ఆమె 1995 జూన్ 27 నుండి 2001 ఆగస్ట్ 13వరకు సర్పంచ్ గా పనిచేశారు. తిరిగి 2001 ఆగస్ట్ 14 నుండి 2006 ఆగస్ట్ 15వరకు అనంతరామయ్య ఉమ్మడి కేజీ. మల్లెల సర్పంచ్ గా పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికలలో విభజన కేజీ.మల్లెల సర్పంచ్ గా గెలిచారు. 1997 నుండి 2002 వరకు కాకర్ల మేజర్ కు అధ్యక్షుడుగా పనిచేసారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత ఏం.ఎల్.ఏ సండ్ర వెంకట వీరయ్యలతో కలసి పనిచేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పనిచేసి అండమాన్ నికోబార్ దీవులుగా పిలువ బడే కేజీ.మల్లెల పంచాయితిని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారు. పంచాయతీకి కావలసిన మౌలిక వసతులు కల్పించి అభివృద్ధిలో చెరగని తనదైన ముద్ర వేశారు. ప్రజల ఆదరాభిమానాలు పొందారు. జిల్లాలో కేజీ.మల్లెలను ఉత్తమ పంచాయితీగా నిలిపారు. తన అనుచరులను వివిధ ఎన్నికల్లో పోటీకి నిలిపి గెలిపించుకున్నారు. అనంతరామయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవళ్లు, ఒక మునిమనవరాలు ఉన్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని తెలిపారు.
రాజకీయ యోధుడు పోట్రు అనంతరామయ్య మృతి
Related tags :