గ్రహఫలం..సోమవారం, 02.10.23
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం,
సూర్యోదయం : 5.53
సూర్యాస్తమయం : 5.51
తిథి: బ.పాడ్యమి ప.2.03 వరకు, తదుపరి విదియ,
నక్షత్రం: రేవతి రా.12.07 వరకు, తదుపరి అశ్వని,
వర్జ్యం: ప.12.44 నుండి 2.14 వరకు,
దుర్ముహూర్తం: ఉ.5.53 నుండి 7.29 వరకు,
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
అమృతఘడియలు: రా.9.49 నుండి 12.21 వరకు
మేషం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృషభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన.
మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: పనులు ముందుకు సాగవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: కొత్త పనులకు శ్రీకారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వాహనయోగం.
ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమతప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆస్తిలాభం.
మీనం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.