వల్లేపల్లి శశికాంత్-ప్రియాంక దంపతులు హైదరాబాద్‌లో తానా, సిసిసి, స్వేచ్ఛ సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరానికి విరాళం అందించారు. 700మందికి ఈ శిబిరంలో ఉచితంగా వైద్యసేవలందించారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్ ప్రాంతాలకు చెందిన పేదలకు 13మంది వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన వైద్య సామాగ్రిని అందించారు. రోగులకు పండ్లు, భోజనం అందజేశారు. సీసీసీ అధ్యక్షుడు చక్రధర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, బీటెక్ విద్యార్థులు, బ్యాంక్ ఉద్యోగులు వలంటీర్లుగా సేవలు అందించారు.