Kids

సికింద్రబాద్-సిద్ధిపేట టికెట్ ధర సమయపట్టిక

సికింద్రబాద్-సిద్ధిపేట టికెట్ ధర సమయపట్టిక

సిద్దిపేట జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి సిద్దిపేట జిల్లాలో రైలు పరుగులు పెట్టనుంది. అక్టోబర్ 3 మంగళవారం నుంచి సిద్దిపేట -సికింద్రాబాద్‌ మధ్య రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి సిద్దిపేట- నుంచి -సికింద్రాబాద్ మధ్య రెండు ప్యాసింజర్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్‌ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్‌ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు.

*** టైమింగ్స్ ఇవే..
07483 నెంబర్ గల ప్యాసింజర్ రైలు..సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో 07484 నెంబర్‌ గల రైలు సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.10గంటలకు సికింద్రాబాద్‌కు చేరనుంది. సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న రైలు.. సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది.

*** ఈ స్టేషన్లలో రైలు ఆగనుంది..
సికింద్రాద్‌ నుంచి సిద్దిపేటకు రైలు మార్గం మొత్తం 116 కిలోమీటర్ల మేర ఉండనుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరనున్న ప్యాసింజర్‌ రైలు.. మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్స్‌లో ఆగనుంది. సికింద్రాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు రైలు ఛార్జీ రూ. 60గా ఉండనున్నట్లు తెలుస్తోంది.