చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విత్య రామ్‌రాజ్ (25) అదరగొట్టింది. సోమవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్ క్వాలిఫైడ్ రౌండ్స్‌లో 55.42 సెకన్‌ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసింది. దాంతో అత్యంత వేగంగా ఈ రేసు పూర్తి చేసిన భారత మహిళగా పీటీ ఉష రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఈ ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌కు విత్య రామ్‌రాజ్ అర్హత సాధించింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అత్యంత వేగంగా పరుగెత్తిన భారత మహిళగా ఇప్పటి వరకు పీటీ ఉష పేరిట రికార్డు ఉంది. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్‌ల టైమింగ్‌తో 400 మీటర్ల హర్డిల్స్ రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి దాదాపు 39 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు విత్య రామ్‌రాజ్ సమం చేసింది.
పీటీ ఉష రికార్డు సమం చేసిన విత్య రామరాజ్
Related tags :