మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ ను ఖండిస్తూ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో మహిళల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా తమ సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని సాయి బొల్లినేని, భాను మాగులూరి సమన్వయపరిచారు. సాయిసుధ పాలడుగు, మంజు గోరంట్ల, అనిత మన్నవ, దీప్తి మాగులూరి, శైలజ బొల్లినేని, ఇందిర చలసాని, శిరీష నర్రా, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, సరిత పోసాని, వల్లి వల్లు, శ్రీలత నార్ల, బిందు బొల్లి, శ్రీవిద్య సోమ తదితరులు పాల్గొన్నారు.
డీసీలో చంద్రబాబుకు ప్రవాస మహిళల సంఘీభావం
Related tags :