సమాజహిత రచనల ద్వారా ప్రజాసేవ చేసిన గొప్ప రచయిత పోలవరపు కోటేశ్వరరావు అని ఏపీ అధికార భాష సంఘ మాజీ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి 25వ వార్షికోత్సవ కోటేశ్వరరావు పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పలురకాల కథావస్తువులను ఎంచుకుని వాటికి న్యాయం చేస్తూ పాఠకుడికి సమాజానికి సాహితీసేవ చేసిన మహోన్నతుడు పోలవరపు అని ఆయన కొనియాడారు. గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజాజీవనంపై పోలవరపు చేసిన రచనలు పల్లెజీవితాల పట్ల ఆయనకున్న మమకారాన్ని తెలియజేస్తాయని యార్లగడ్డ పేర్కొన్నారు. కృష్ణా తీరాన్ని ఆధారం చేసుకున్న కోటేశ్వరరావు సాగించిన రచనలు పాఠకుల హృదయాలను హత్తుకున్నాయని వెల్లడించారు. ప్రజానాట్య మండలి సభ్యుడిగా నిత్యం ప్రజాచైతన్యం కోసం తపించిన సమాజహితపిపాసి పోలవరపు కోటేశ్వరరావు అని లక్ష్మీప్రసాద్ వెల్లడించారు.
సమాజహిత రచనలు చేసిన అభ్యుదయవాది పోలవరపు కోటేశ్వరరావు:యార్లగడ్డ
Related tags :