ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం కురిసింది. మహిళల 5000 మీ ఫైనల్‌లో పారుల్ చౌదరీ పసిడి పతకాన్ని పట్టేసింది. రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తిన చివర్లో వేగం పెంచి మొదటి స్థానంలో నిలిచింది. మొదటి నుంచి వేగంగా పరుగెత్తిన రిరికా హిరోనకా (జపాన్) చివర్లో శక్తిని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పారుల్‌కిది రెండో పతకం. సోమవారం మహిళల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ రజత పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట
Related tags :