ఏపీలో ఒక సైకో పరిపాలన నడుస్తోంది. ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం అక్కడ జరుగుతోంది. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేశారు అనేదే మా ప్రశ్న. ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదు. అనవసరంగా ఎవరిపైనా మేము నిందలు వేయం. కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేయాలి. భాజపా అధ్యక్షురాలిగా మా అక్క పురందేశ్వరి ఉన్నారు. ఆమెతో టచ్‌లో ఉన్నాం. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంపై కలుస్తా. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా నేను పట్టించుకోను. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్. రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలు. బురద మీద రాయి వేస్తే మన మీదే పడుతుంది’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
మా అక్కతో టచ్‌లో ఉన్నాను. జూనియర్ స్పందన నాకు అనవసరం.
Related tags :