గత ఏడాది జులై-సెప్టెంబరులో 7,900 ఇళ్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఇదే కాలంలో 5 శాతం వృద్ధితో 8,325 యూనిట్లను స్థిరాస్తి సంస్థలు విక్రయించాయి. హైదరాబాద్లో ఇళ్ల ధరల విషయంలోనూ గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కోల్కతాలో 7%, బెంగళూరు, ముంబయిలలో 6 శాతం చొప్పున, పుణెలో 5 శాతం, అహ్మదాబాద్, దిల్లీలలో 4 శాతం, చెన్నైలో 3 శాతం వరకు ఇళ్ల ధరలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. ‘నివాస గృహాల మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. దీనికి తగ్గట్లు స్థిరాస్తి సంస్థలు, డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు’ నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల వల్ల పెద్ద ఇళ్ల విక్రయాలు కాస్త ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లో భారీగా గృహ అమ్మకాలు
Related tags :