NRI-NRT

TFAS 40వ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు

TFAS 40వ వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు

న్యూజెర్సీ తెలుగు కళాసమితి (Telugu Fine Arts Society) 40వ వార్షికోత్సవం ఆదివారం నాడు ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో నిర్వహిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలో మహిళ, యువత, వైద్య, సాహితీ, సాంకేతిక సెమినార్లతో పాటు సిరివెన్నెల, అల్లురామలింగయ్య, కె.విశ్వనాథ్‌లకు స్మృత్యాంజలి కార్యక్రమాలను నిర్వాహక బృందం ఏర్పాటు చేసింది. అనంతరం సాయంత్రం మంగ్లీ-ఇంద్రావతిల సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు రాచకుళ్ల మధు, కన్వీనర్ దాము గేదెలలు ఓ ప్రకటనలో తెలిపారు.