హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట.
ఏడాదిలో అయిదు రోజులు వివస్త్రలుగా మహిళలు
Related tags :