భాజపా (BJP) ట్విటర్ హ్యాండిల్లో కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మార్ఫింగ్ పోస్టర్‌ను పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌పై ‘రావణ్, ఎ కాంగ్రెస్ పార్టీ ప్రొడెక్షన్.. దర్శకత్వం జార్జ్ సోరోస్’ అని రాసిన టైటిల్స్ ఉన్నాయి. భాజపా ఇటీవలికాలంలో జార్జ్ సోరోస్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. ఆయన ప్రఖ్యాత హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ గ్రూప్‌లకు భారీ విరాళాలు ఇస్తూ.. ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకుంటారని కాషాయపార్టీ ఆరోపిస్తోంది.