Politics

2024 ఎన్నికలకు తెదేపా-భాజపా-జనసేన కలిసి వెళ్లాలి

2024 ఎన్నికలకు తెదేపా-భాజపా-జనసేన కలిసి వెళ్లాలి

“2024 ఎన్నికల్లో తెదేపా, జనసే, భాజపా కలిసి వెళ్లాలి. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనేదే నా ఆకాంక్ష” అని పవన్‌ అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. “వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ద్వారా ఐఏఎస్‌లకు జీతాలు వస్తాయి. ఐఏఎస్‌ల జీతాలు మళ్లించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైకాపా నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్‌, ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా? వైకాపా అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.” అని ఆయన అన్నారు.