DailyDose

రైలులో దంపతులపై దారుణం-నేరవార్తలు

రైలులో దంపతులపై దారుణం-నేరవార్తలు

* సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓ యువకుడు అభ్యంతరకంగా ప్రవర్తించాడు. పీకలదాకా మద్యం తాగి తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. అయితే, యూపీకి చెందిన ఓ వృద్ధ దంపతులు ఢిల్లీ వెళ్లేందుకు గత బుధవారం సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. వీరు ఏసీ బోగీలో ప్రయాణిస్తుండగా షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు.. లోయర్‌ బెర్త్‌లో పడుకున్న ఆ దంపతులపై, వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో, వారు ఒక్కసారిగా షాకయ్యారు.

* ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్‌కు చెందిన టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపి.. 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్‌లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

* లంచం తీసుకుంటూ బంజారాహిల్స్‌ సీఐ ఏసీబీ వలకు చిక్కారు. ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ నరేందర్‌ రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్‌ నరేందర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సీఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్‌, నరేందర్‌ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుపుతోంది.

* ఓ భూవివాదం కేసులో తప్పించుకు తిరుగుతున్న నకిలీ సాధువును మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) పోలీసులు (Police) సినీఫక్కీలో అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మొరెనాలోని ఓ ఆలయం పేరిట ఆరు ఎకరాల భూమి ఉంది. అందులో కొనసాగుతున్న దుకాణాల నుంచి అద్దె వసూలు చేయాలని పథకం పన్నిన రామ్‌శరణ్‌ నకిలీ ట్రస్టును స్థాపించి, అద్దెలు తనకే ఇవ్వాలంటూ ఓ లేఖ సృష్టించాడు. ఈ విషయం ఆలయ చీఫ్‌ దృష్టికి రావడంతో ఆయన 2021 నవంబరు 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే ముగ్గురిని అరెస్టు చేయగా.. రామ్‌శరణ్‌ పరారయ్యాడు. ఈ కేసు ఇటీవల హైకోర్టు ముందుకు వచ్చింది. దాంతో పోలీసులు రామ్ శరణ్‌ గురించి ఆరా తీయగా.. అతడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం మథురలోని రామ్‌జానకి ఆలయ ఆశ్రమంలో సాధువుగా చలామణి అవుతున్నట్లు తెలిసింది.

* తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కపిలతీర్థం సమీపంలోని ఓ హోటల్‌లో మహారాష్ట్రకు చెందిన అక్కాతమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్‌, మనీష భార్యాభర్తలు. వీళ్లకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు ప్రక్షయ్‌ (6), కుమార్తె ప్రజ్ఞ (4) ఉన్నారు. తన సోదరుడితో మనీషకు వివాహేతర సంబంధం ఉందని యువరాజ్‌ అనుమానించాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. గత ఏడాదిగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తల్లి వద్దే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం యువరాజ్‌ తిరుపతి వచ్చాడు. అనంతరం స్వస్థలంలో ఉన్న భార్యకు ఫోన్‌ చేసి వివాదానికి ముగింపు చెప్పాలని.. దానిపై మాట్లాడేందుకు తిరుపతి రావాలని కోరాడు. దీంతో మనీష.. తన తమ్ముడు హర్షవర్ధన్‌, పిల్లలను తీసుకుని గురువారం తిరుపతి చేరుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత కపిల తీర్థం సమీపంలో ఓ ప్రైవేటు హోటల్‌కి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక మనీష, ఆమె సోదరుడు హర్షవర్ధన్‌ను పిల్లల ఎదుటే అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పిల్లలను తీసుకుని అలిపిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

* భూపాలప‌ల్లిలో పోలీసులు వాహ‌నాల త‌నిఖీలు చేప‌ట్టారు. దీంతో కారులో త‌ర‌లిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ గంజాయి విలువ రూ. 1.86 ల‌క్ష‌లు ఉంటుంద‌ని ఎస్పీ క‌రుణాక‌ర్ వెల్ల‌డించారు. నిందితుల‌ను భూపాల‌ప‌ల్లి జిల్లా కేంద్రానికి చెందిన కంది సాయికిర‌ణ్, మంద‌ల క‌ల్యాణ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.