Politics

షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుబిడ్డ అని చెప్పుకుంటూ తిరుగుతున్న వైయస్ షర్మిల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. అటు ఏపీ ఇటు తెలంగాణలో… రెండు రాష్ట్రాలలో వైయస్ షర్మిల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ… ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు వైయస్ షర్మిల. అయితే వైయస్ షర్మిల చేస్తున్న ఈ ప్లాన్ రివర్స్ అయిపోయింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల లేదా రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల పరిస్థితి… చాలా దారుణంగా తయారయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. దీంతో పాలేరు నుంచి షర్మిల పోటీకి సిద్దం అయ్యారు వైఎస్‌ షర్మిల. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన షర్మిల… కాంగ్రెస్ పార్టీతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుంచి పోటీకి రెడీ అయ్యారు.

ముందు నుంచి షర్మిల రాకను వ్యతిరేకిస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…ఆమెను పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానంతో చెప్పారట. దీంతో కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. ఈ తరుణంలోనే.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు షర్మిల. ఇక షర్మిల పార్టీ నుంచి పోటీ కోసం రెండు మూడు రోజుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.