Devotional

ఈ వారం మీ రాశి ఫలితాలు

ఈ వారం మీ రాశి ఫలితాలు

హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (08-10-2023 నుండి 14-10-2023)✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు

🐐 మేషం (08-10-2023 నుండి 14-10-2023)

మంచి ఫలితాలు ఉన్నాయి. చక్కటి శుభకాలం ఇది. ఒక వ్యవహారంలో శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మీ మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. దైవధ్యానంతో మనోబలం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. క్రమంగా శుభం చేకూరుతుంది. ఇష్టదైవ సందర్శనం శుభాన్ని ఇస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం (08-10-2023 నుండి 14-10-2023)

మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలు స్పష్టం అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు ఆరాధన శక్తిని ఇస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం (08-10-2023 నుండి 14-10-2023)

ప్రారంభించిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి ఉంది. అవసరానికి డబ్బు అందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం మేలుచేస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధికంగా శ్రమించాలి. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగకండి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ శుభప్రదం. ఇష్టదేవతా పారాయణ చేస్తే బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం (08-10-2023 నుండి 14-10-2023)

కార్యసిద్ధి ఉంది. లక్ష్యసాధనలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారలాభం ఉంది. దైవబలం సదా కాపాడుతోంది. చంచలత్వం లేకుండా చూసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించడం మేలు. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం (08-10-2023 నుండి 14-10-2023)

శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి . కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. ధనసాయం అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువుల సహకారం అందుతుంది. వారం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతారాధన శుభప్రదం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య (08-10-2023 నుండి 14-10-2023)

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో జాగరూకతతో వ్యవహరించాలి. శారీరక బలం పెరిగి, కొన్ని కీలక సమయాలలో అవసరం అవుతుంది. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. నవగ్రహ స్తోత్రం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
💃💃💃💃💃💃💃

⚖ తుల (08-10-2023 నుండి 14-10-2023)

సహనంతో వ్యవహరిస్తే సంకల్పాలు నెరవేరుతాయి. చేపట్టిన పనులలో లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టు వదలకండి. ఫలితం చేజారకుండా శ్రద్ధగా పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. ఆచార,సంప్రదాయాలను గౌరవిస్తారు. బంధు,మిత్రులను ఆదరిస్తారు. అపార్ధాలకు అవకాశం ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెలగాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు చేయకండి. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం (08-10-2023 నుండి 14-10-2023)

కృషి ఫలిస్తుంది. మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. దుర్గాదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు (08-10-2023 నుండి 14-10-2023)

శీఘ్ర కార్యసిద్ధి ఉంది. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహనిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పొరపొచ్చాలకు దూరంగా ఉండాలి. కొన్ని వార్తలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. తోటివారితో మీ భావాలను పంచుకోవడం వల్ల మనఃశ్శాంతి పెరుగుతుంది. శ్రీలక్ష్మీ సందర్శనం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం (08-10-2023 నుండి 14-10-2023)

సంకల్పాలు సిద్ధిస్తాయి. ధార్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారానికి సంబంధించి పెద్దల సహకారంతో ఒక ముందడుగు వేస్తారు. తెలివిగా వ్యవహరించి శత్రువుల మీద పైచేయి సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించి ముందడుగు వేయడం ఉత్తమం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర భయాందోళనలు మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనం మీ మానసిక శక్తిని పెంచుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం (08-10-2023 నుండి 14-10-2023)

ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఏకాగ్రతతో పనిచేయాలి. మొహమాటం లేకుండా పనిచేయాలి. కాలం సహకరించట్లేదు. ఖర్చులు పెరుగుతాయి. వైరాగ్యాన్ని రానీయకండి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చు. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇష్ట దైవారాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం (08-10-2023 నుండి 14-10-2023)

సకాలంతో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. మీలోని మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ సందర్శనం శుభప్రదం
🦈🦈🦈🦈🦈🦈🦈