Politics

గన్‌మెన్ చెంప పగలగొట్టిన మహమూద్ అలీ

గన్‌మెన్ చెంప పగలగొట్టిన మహమూద్ అలీ

హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వోన్నత పాఠశాలలో శుక్రవారం ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరయ్యారు. కొద్దిసేపటికి హోంమంత్రి అక్కడికి చేరుకున్నారు. వస్తూనే వేదికపైకి చేరుకుని తలసానిని ఆలింగనం చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే తన గన్‌మన్‌ను పూలబొకే ఏదని ప్రశ్నిస్తూనే చెంపపై కొట్టారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై హోంమంత్రి తక్షణం క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. హోం మంత్రిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు బక్క జడ్సన్‌ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.