Business

కాజీపేట నుండి పూణేకి మరో రైలు

కాజీపేట నుండి పూణేకి మరో రైలు

వరంగల్‌, జనగామ, భువనగిరి నుంచి మహారాష్ట్రలోని పుణెకు మరో రైలు సర్వీసు వచ్చింది. పుణె (హడప్సర్‌)-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట వరకు పొడిగించడంతో జిల్లాల ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌కు బదులుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగుతున్నట్లు ద.మ.రైల్వే ఆదివారం ప్రకటించారు. ఈ మార్పులు 9 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని ద.మ.రైల్వే సూచించింది. టెర్మినల్, మార్పు టెర్మినల్ ప్రయాణికుల మొబైల్ నంబర్లకు పంపించబడింది. కాజీపేట-పుణె(నెం.17014/17013) ఎక్స్‌ప్రెస్‌ వారంలో మూడురోజులు మంగళ, శుక్ర, ఆదివారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాజీపేట నుంచి పుణెకు 16 గంటల్లో చేరుకుంటుంది. సాయంత్రం 6.15కి కాజీపేట నుంచి బయల్దేరే ఈ రైలు 6.59కి జనగామ స్టేషన్‌, రాత్రి 7. 29కి భువనగిరి స్టేషన్‌, రాత్రి 8.25కి సికింద్రాబాద్‌కు మరుసటిరోజు ఉదయం 10.50 గంటలకు పుణె (హడప్సర్‌) చేరుకుంటుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు 2 గంటల్లో, పుణెకు 16 గంటల్లో ఈ రైలు చేరుకోనుంది.