Business

APCOB Recruitment : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

APCOB Recruitment : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇటీవల వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఏపీలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలోని లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. ఇక ఈ ఉద్యోగాల కు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా చేస్తారు.

దరఖాస్తు ఫీజుగా జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. జీతం నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920గా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది.. ఈ నెల 21.. వచ్చే నెలలో ఈ పరీక్షను నిరర్వహించనున్నారు.. ఈ ఉద్యోగాల కు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..