Sports

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ఐసీసీ వరల్డ్ కప్-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరల్డ్ కప్ తమ మొదటి మ్యాచ్‌లో గెలుపొంది టోర్నీలో శుభారంభం చేసేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఒక వైపు పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో టీమిండియా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మరోవైపు ఆసిస్ జట్టులో కీలక ఆటగాళ్లైన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్‌లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

చెపాక్ మైదానం పూర్తిగా స్పిన్‌కు సహకరించే పిచ్ కావడంతో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆసిస్ జట్టులో ఆడమ్ జాంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు స్పిన్ బాధ్యతలను మోయనున్నారు. ఇక పేస్ విభాగంలో వన్డే వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ మహమ్మద్ సిరాజ్, షమీ, బుమ్రాలతో భారత జట్టు పటిష్టంగా ఉంది. పత్యర్థి జట్టులో మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, హెజిల్‌వుడ్ లాంటి వరల్డ్ క్లాస్ పేస్ బౌలర్లు ఉన్నారు. దీంతో మ్యాచ్ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగనుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు

తుది జట్లు ఇలా..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కే.ఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఆశ్విన్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, ఆడమ్ జాంపా.