తిరుమల, విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాలను అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6 గంటల నుంచి అక్టోబర్ 29 ఉదయం వరకు మూసివేయనున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయాన్ని 29 వ తేది ఉదయం 9 గంటల తరువాత భక్తులను అనుమతిస్తారు. తిరుమలలో మాత్రం అక్టోబర్ 29 తెల్లవారు జామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు.
అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా (Lunar eclipse) తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రి మూసివేయబడుతుంది.. అక్టోబర్ 29న తిరిగి తెరవబడుతుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం గంటలకు పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కూడా..పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 29న తెల్లవారుజామున 3:30 గంటలకి ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ, అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజలు ఆర్చకులు పూర్తి చేస్తారు.ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తులకు అనుమతిస్తారు.
2023లో ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలో 2023 సంవత్సరంలో రెండవది చివరి చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపించనుంది. కాగా ఈ ఏడాది ఇదే చివరి చంద్రగ్రహం కావటం విశేషం.