తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. తనిఖీల్లో భాగంగా పలు నగదు ఉంచడం, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉన్న తాయిలాలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపిన వీటిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు.
సుమారు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్ నంబర్ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్ ఉన్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌తోపాటు పోలీసులు తనిఖీలు చేశారు. ప్రగతి నగర్, మధురానగర్, బోరబండ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. పలు ప్రాంతాల్లో బెల్టు షాపులపై ఆకస్మిక దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
శేరిలింగంపల్లి గోపన్‌పల్లి తండాలో ఓటర్లకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఎల్బీనగర్‌లోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. ఈ ధర ఓ వాహనదారుడి వద్ద రూ.4 లక్షలు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
షాద్‌నగర్ పరిధిలో మూడు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఏపీసీ రంగస్వామి. రాయికల్ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ 11.5 లక్షలు పట్టుబడ్డాయి.
నెక్లెస్‌రోడ్‌లోని ఐమాక్స్ ఎదురుగా ఖైరతాబాద్ పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. ఓ కారుకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
👉 – Please join our whatsapp channel here
“https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z”