Fashion

కొడిగుడ్లతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు

కొడిగుడ్లతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, డ్రై నెస్, చుండ్రు వంటి జుట్టు సమస్యలు సర్వసాధారణమైపోయాయి. జుట్టును సిల్కీగా, అందంగా చేయడానికి ఖరీదైన ప్రొడక్ట్స్ లను వాడుతుంటారు. కానీ వీటిలో ఉండే రసాయనాలు మీ జుట్టును దెబ్బతీస్తాయి. జుట్టును అందంగా మార్చడానికి గుడ్డు కూడా ఉపయోగపడతుంది తెలుసా? అవును గుడ్డు ఎన్నో జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.

గుడ్డు సంపూర్ణ ఆహారం. అందుకే రోజూ ఒక గుడ్డును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు, డాక్టర్లు చెప్తారు. గుడ్లను ఆమ్లెట్లు, శాండ్విచ్లతో పాటుగా ఎన్నో వంటకాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి గుడ్డులో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. కానీ ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. నిజానికి గుడ్డు మన జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణలో భాగంగా గుడ్లను చేర్చుకుంటే మీ జుట్టును సిల్కీగా, అందంగా మెరుస్తుంది. ఇందుకోసం జుట్టుకు గుడ్లను ఎలా అప్లై చేయాలి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలకు…ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు మీ నెత్తికి పోషణను అందిస్తాయి. ఇందుకోసం గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనతో జుట్టుకు మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అలాగే జుట్టు బలంగా మారుతుంది. మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు గుడ్డును నెత్తికి అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

జుట్టు డ్యామేజ్…సీజన్ మారుతున్నప్పుడు జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా జుట్టు నీరసంగా, జీవం లేనట్టుగా, గరుకుగా మారుతుంది. ఇలాంటి సమస్యలను తగ్గించడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. గుడ్లలో సహజంగా కెరాటిన్ తో పాటుగా ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనెను వేసి కలపండి. దీన్ని జుట్టుకు అప్లై చేయండి. కాసేపటి తర్వాత తలస్నానం చేయండి.

జుట్టుకు మాయిశ్చరైజ్…ఎలాంటి జుట్టు సమస్యలున్నవారికైనా గుడ్డు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా డ్రైనెస్ ను పొగొట్టుకునేవారికి. జుట్టు డ్రై గా ఉండేవారు హెయిర్ మాస్క్ తయారు చేయడానికి గుడ్లను ఒక గిన్నెలో పగులగొట్టి బాగా కలపండి. దీనిలో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెను వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

చుండ్రును తొలగించడం….గుడ్డును కండిషనింగ్ హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. దీనిని యూజ్ చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేయడానికి ఒక గిన్నెలో మొత్తం గుడ్డును కొట్టాలి. దీనిలో టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని జుట్టుకు, నెత్తికి బాగా అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత నీటితో జుట్టును వాష్ చేయండి.