Politics

నేడు సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణ

నేడు సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణ

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ పై నేడు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిన్న దాదాపు మూడు గంటలకు పైగా వాదనలు విన్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. నిన్న చంద్రబాబు తరుపున క్వాష్ పిటీషన్ పై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. హరీశ్ సాల్వే ప్రధానంగా 17 ఎ మీదనే తన వాదనను కొనసాగించారు.

సీఐడీ తరుపున…. అయితే ఈరోజు మాత్రం సీఐడీ తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. సిీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలను వినిపించనున్నారు. ఇప్పటికే ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటీషన్లు, హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ కొట్టివేయడంతో ఈరోజు చంద్రబాబుకు కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్న టెన్షన్ తెలుగుదేశం పార్టీలోని కింది స్థాయి నుంచి నేతల వరకూ నెలకొని ఉంది.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z