Health

నిద్ర సరిగా లేకపోతే బీపీ పెరుగుతుందా?

నిద్ర సరిగా లేకపోతే బీపీ పెరుగుతుందా?

కొంతమందికి ఎంత ప్రయత్నించినా రాత్రుళ్లు అస్సలు నిద్రపట్టదు. ఏవే ఆలోచనలు వెంటాడుతుంటాయి. దాంతో ప్రయత్నించినా నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అలా అర్ధరాత్రి ఒంటి గంటా, రెండు దాటినా కూడా నిద్రపట్టదు. దీనివలన అలాంటి వారు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా ప్రభావం ఉంటుంది. ప్రతి రోజూ రాత్రుళ్లు 7-8 గంటలు సరైన నిద్ర లేక పోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా హై బీపీ.. అధిక రక్తపోటు ముఖ్యంగా గుండెకు ప్రమాదకరం. గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. కాబట్టి బీపీ పెరగకుండా చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది. అధిక బిపికి దారితీస్తుందని బహుశా మీరు వినివుండే ఒక విషయం ఏమిటంటే.. రాత్రి వేళల్లో మంచి నిద్రపోకపోవడం. నిజానికి రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే బీపీ పెరుగుతుందా? అలాంటి ‘రిస్క్’ ఉందా? అనే అంశాన్ని పరిశీలించినట్టయితే.. నిద్ర సక్రమంగా లేకపోతే అది కచ్చితంగా బీపీ హెచ్చుతగ్గులకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వారు రాత్రి (కనీసం 7 గంటలు) మంచి నిద్రపోయేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ప్రముఖ హెల్త్ పబ్లికేషన్ ‘హైపర్‌టెన్షన్’లో ప్రచురించబడిన అధ్యయన నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. రాత్రిపూట మంచి నిద్ర సక్రమంగా లేకపోతే మహిళల్లో బీపీ పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

25 నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 65,000 మంది మహిళలను ఈ అధ్యయనం కోసం పరిశోధకులు ఎంపిక చేశారు. ఇది పదహారేళ్ల సుదీర్ఘ అధ్యయనం. వారిలో చాలామందికి చదువుకునే సమయంలో బీపీ సమస్యలు లేవు. అయితే ఆ తర్వాత చాలా మందికి బీపీ పట్టుకుంది. వీరందరికీ నిద్ర సమస్యలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నిద్రలేమి, నిద్రలో లేవడం, గాఢనిద్ర రాకపోవడం వంటి సమస్యలన్నీ హైబీపీకి దారితీస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

లింగంతో పాటు, వయస్సు, జాతి, భౌగోళిక వ్యత్యాసాలు, ఆరోగ్య పరిస్థితులు, శరీర బరువు, BP వంశపారంపర్యత కూడా అనేక ఇతర అంశాలను ప్రభావితం చేస్తాయని అధ్యయనం కనుగొంది. వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, నిద్ర లేకపోవడం కూడా బీపీని పెంచుతుంది.