DailyDose

ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

ఏపీ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్

విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు GRE, GMAT తదితర పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తేవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన మెటీరియల్ మరియు ట్రైనింగ్ సైతం విద్యార్థులకు ఫ్రీగా అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎంఐటి మరియు హార్వాడ్ కోర్సులను ఉన్నత విద్యా సిలబస్లోకి తీసుకు వస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఎడెక్స్ తో కలిపి సర్టిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీఎం జగన్.

కాగా, ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెల్లో రంధ్రం, కాళ్లు మరియు చేతులు వంకరగా ఉండటం ఇలా వ్యాధులు ఉంటే ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు. ఇలా ఏ తల్లి శోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.