Politics

పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన జగన్‌

పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన జగన్‌

జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటన చేశారు సీఎం జగన్. పార్టీ శ్రేణులకు వరుసగా కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించిన సీఎం జగన్… జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు ఉంటుందని..పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచుతున్నామని.. పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు ఉంటాయన్నారు. గ్రామ స్థాయిలో జరిగే సంబరాల్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని సీఎం జగన్‌ అన్నారు. విజయవాడ సభలో నాలుగు కీలక కార్యక్రమాలు ప్రకటించింది వైసీపీ.. జగనన్న ఆరోగ్య సురక్షా, వై ఏపీ నీడ్స్ జగన్, బస్సు యాత్ర, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చామని.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగామని పేర్కొన్నారు.