భారత్‌కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్‌ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సిటిజన్ గ్రూప్ ఆధ్వర్యంలో రెండో రోజు నిర్వహించిన యూత్ పార్లమెంట్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా యువత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గాంధీ లేకపోయినా స్వాతం త్య్రం వచ్చేదని, దేశ సమైక్యత ఆయన వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానిం చారు. ఈ వ్యాఖ్యలతో కొందరు గందరగోళానికి గురయ్యారు.
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ లక్ష్యాలు గొప్పగా ఉంటున్నా, కొందరు వారి ప్రయోజనాలకు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే చదువు అడ్డు కాదని, ప్రశ్నించే విధానం రావాలని వెల్లడించారు. ఇక్కడ ఒక నియోజ కవర్గంలో ఎన్నికల కోసం పెట్టే ఖర్చు.. బ్రిటన్‌లో ఎన్నికల మొత్తంతో సమానం అవుతుందని వివరించారు. సమావేశానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి మహమూద్ అలీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి, సిటిజన్ గ్రూప్ సీఈవో స్వాతి చంద్రశేఖరన్ పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z