Devotional

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు ఏర్పాటు చేశారు.

తితిదే ఛైర్మన్‌ వెల్లడించిన నిర్ణయాలివే..

* అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాం.

* భక్తులకు ముఖ్యమైన హోమంలో స్వయంగా పాల్గొనే అవకాశం కల్పిస్తాం.

* తితిదే పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ₹12 వేల నుంచి ₹17 వేలకు పెంపు.

* 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తింపు.

* తితిదే పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3% పెంచేలా నిర్ణయం.

* కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు ఆకాల మరణం పొందితే వారికి ₹2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు.

* కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తింపజేస్తాం.

* నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్ల ఏర్పాటుకు ₹18 కోట్లు కేటాయింపు.

* నారాయణగిరిలో హోటల్స్‌, అన్నమయ్య భవన్‌లో హోటల్స్‌ను టూరిజం శాఖకు అప్పగిస్తాం.

* ఆకాశ గంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ₹40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం.

* వరాహస్వామి అతిథి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ₹10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం.

* తిరుపతిలో తితిదే అనుబంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను తితిదే పరిధిలోకి తీసుకొస్తాం.

* పురాతన గోపురాల నిర్వహణ నిపుణులతో కమిటీ ఏర్పాటు.

* తిరుపతిలోని చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు ₹25 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం.

* తితిదే పరిధిలోని పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించేందుకు చర్యలు.

* తితిదే కల్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డీజేలకు బదులుగా లలిత గీతాలు పాడేందుకు మాత్రమే అనుమతిస్తాం.