Kids

ఒక్క తడబాటుతో కుంభకర్ణుడు జీవితాంతం..నిద్రలో…..!!

ఒక్క తడబాటుతో కుంభకర్ణుడు జీవితాంతం..నిద్రలో…..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఆరు మాసాలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు మేల్కొంటాడనే విషయం మాత్రమే మనకు తెలుసు.
కానీ రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర గురించి
పూర్తిగా ఎవరికీ తెలియదు.

🌸రావణుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు
ఆరు మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు.
ఆ రోజంతా తిని మళ్లీ నిద్రపోతాడు.

🌿అసలు నిరంతరం నిద్రలో ఉండానికి కారణం ఏంటనే విషయం ఎవరికైనా తెలుసా?.

🌸రామాయణంలోని ఉత్తర కాండలో దీని గురించి పేర్కొన్నారు.
రాక్షస సోదరులైన..
రావణుడు, విభీషణుడు,
కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యాయంలో తెలియజేశారు.

🌸దైవానుగ్రహం కోసం తండ్రి విశ్రావసుడి ఆఙ్ఞతో ముగ్గురు సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణాదులు తపస్సు ప్రారంభించారు.
అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలను కోరుకోమన్నాడు.

🌿ముందు రావణుడిని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానికి తిరస్కరించాడు.

🌸అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతలు వల్ల మాత్రం మరణం ఉండదని వరమిచ్చాడు.

🌿విభీషుణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు.
దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదించాడు.

🌸కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు.
అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని పేర్కొన్నారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు.
తృప్తిపరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు.

🌿దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని మభ్యపెట్టి వరం అడగకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇందుకు జ్ఞానం, తెలివితేటలకు మూలమైన తన భార్య సరస్వతి దేవి సహాయాన్ని బ్రహ్మ అర్థించాడు.

🌸కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుకను నియంత్రించాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసం వరంగా కోరుకోవాలని పొరపాటున కుంభకర్ణుడు
నిద్రాసనం అని అన్నాడు.
దీనికి వెంటనే బ్రహ్మ తధాస్తు అని వరం ఇచ్చాడు.

🌿వెంటనే రావణుడు కలుగజేసుకుని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండటం సరికాదు,
ఒక నిర్ణీత సమయం ఉండాలని,
తర్వాత మేల్కొనేలా సడలించమన్నాడు.

🌸అతడు ఆరు మాసాలు నిద్రలో ఉండి ఒక రోజు మేల్కొంటాడు.
ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించి మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మ వరం ప్రసాదించాడు.

🌿రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు నిద్రపోయిన కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొలిపినట్లు రామాయణంలోని యద్ధ కాండలో వివరించారు.

🌸మోక్షం పొందడానికే రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్లు తులసీదాస్ రచించిన రామచరితమానస్ తెలియజేస్తుంది.
రాముడు శ్రీమహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు.
అందుకే సీతను అపహరించినందుకు రావణుడిని వ్యతిరేకించాడు కూడా…!!

🌹కర్మ కాండలు🌹

🌿రామాయణంలోని కుంభకర్ణుడు ధర్మాధర్మ విచక్షణగలవాడు. అనేక సందర్భాలలో ధర్మాచరణ విషయమై  రావణునికి హితోపదేశం చేసినవాడు. కుంభకర్ణుడు గొప్ప దీర్ఘదర్శి.

🌸రావణుని ఆగ్రహానికి గురైన విభీషణుడు రాముని వద్దకు వెళుతూ కుంభకర్ణుని కూడా రాముని పక్షాన చేరమని కోరినప్పుడు  తాను భాతృఋణం  తీర్చుకోవాలని, అందువలన తన ప్రాణాలు పోయేవరకు రావణునితోనే వుంటానని స్పష్టంచేసేడు.

🌿అదే సమయంలో కనిష్ట సోదరుడైన  విభీషణుడు రాముని శరణుపొందడం ఒకందుకు మంచిదేనంటాడు. 
కుటుంబంలో ఎవరైనా మరణిస్తే  వారి సంతతి ఆ పెద్దలకు ధర్మోదకాలు, తర్పణాలు యివ్వడం వారి కర్తవ్యం.

🌸ఆవిధంగా చేయడంవలన పితృదేవతలకు సద్గతులు లభించి తృప్తిచెందుతారు. 

🌿కుంభకర్ణుడు రాక్షసుడైనా  సద్గతులు పొందాలని ఆశించాడు.
రామ రావణ సంగ్రామం వలన
దానవజాతి అంతా నశిస్తుందని  కుంభకర్ణునికి ముందే తెలుసు. 

🌸 రాముడి పక్షాన చేరిన విభీషణుడు  క్షేమంగా వుండి యుధ్ధంలో ప్రాణాలు కోల్పోయిన తనవారందరికి తర్పణాలు వదలి ఋణవిముక్తులను చేయాలని ఆశించేడు.

🌿అందుకే విభీషణునితో
” నీవు రామునితో వుండి మాకు
చేయవలసిన కర్మకాండలు ,  తర్పణాలు విధి విధానంగా చేయమని ఆదేశించాడు.

🌸పితృతర్పణాలు వదలవలసిన కర్తవ్యం అందరికీ ఉంది. అమావాస్య వంటి తిధులలో  పితృ తర్పణాలు
యివ్వడం వలన మనకి సదా!! వారి ఆశీర్వాదాలు లభిస్తాయి…