తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్ఆర్‌ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో ‘కాంతితో క్రాంతి’ పేరిట నిరసన దీక్ష చేపట్టారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మౌంటైన్ హౌస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z