దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే తప్పును గ్రహించి నాలుక కరుచుకున్నాడు. బీజేపీ ఓడిపోతుందని తన వ్యాఖ్యలను సవరించుకున్నాడు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ సర్కారు ఉన్నదని ఈ ఎన్నికలతో అక్కడ సర్కారు మారిపోతుందని చెప్పాడు. అదేవిధంగా రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రభుత్వాలు మారిపోతాయని వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మారుతుందని చెప్పిన రాహుల్ గాంధీ.. అదే ఫ్లోలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రభుత్వాలు మారిపోతాయని చెప్పాడు. ఆ తర్వాత పొరపాటును గ్రహించి నాలుక కరుచుకున్నాడు. సారీ సారీ తప్పుగా చెప్పానంటూ తన వ్యాఖ్యలను సరి చేసుకున్నాడు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z