అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump ) పాకిస్థాన్‌లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ పంజాబ్‌లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. ‘ఆయే కుల్ఫీ… కుల్ఫీ! ఆ… ఖోవో కుల్ఫీ, కుల్ఫీ, కుల్ఫీ’ అంటూ పాటలు పాడతాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
కాగా, 2021లో కూడా పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ మాదిరి పోలికలున్న అతడు పాటలు పాడుతూ తన ఐస్ క్రీం బండి ద్వారా కుల్ఫీలు అమ్ముతున్న వీడియో క్లిప్ నాడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నెటిజన్లను షాక్ చేయడంతోపాటు ఎంతో ఆకట్టుకున్నది. పాకిస్థానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా ఈ వీడియో క్లిప్‌ను నాడు షేర్ చేశారు. ‘వాహ్ కుల్ఫీ వాలీ భాయ్, క్యా బాత్ హై..’ అంటూ అతడి పాటలను ప్రశంసించారు.
👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z