బీఈడీ పూర్తి చేసిన బీటెక్ విద్యార్థులు ఇక నుంచి ఉపాధ్యాయ కొలువులకూ పోటీపడొచ్చు. తాజాగా వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్ విద్యార్థులకు 2015 సంవత్సరం నుంచే బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. వారికి 2017లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. ఇటీవల 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ గణితం, భౌతికశాస్త్రం పోస్టులకు వారు పోటీపడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వారికి ఒకట్రెండు రోజుల్లో అవకాశం ఇవ్వనున్నారు.
👉 – Please join our whatsapp channel here